గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 10:24:06

ఎన్సీబీ కార్యాల‌యానికి ర‌కుల్ !

ఎన్సీబీ కార్యాల‌యానికి ర‌కుల్ !

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం సినీ ఇండ‌స్ట్రీలో గుబులు రేపుతుంది. సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత డ్ర‌గ్స్ కి సంబంధించి ప‌లు చాటింగ్‌లు బ‌య‌ట‌కు రావ‌డంతో ఎన్సీబీ అధికారులు దీనిపై లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇప్ప‌టికే రియాతో పాటు ప‌లువురిని అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ దీపికా పదుకునే , సారా అలీఖాన్‌, శ్ర‌ద్దాక‌పూర్ , రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లతో పాటు ప‌లువురికి సమన్లు జారీ చేసిన‌ట్టు తెలుస్తుంది.

కొద్దిసేప‌టి క్రితం ఎన్సీబీ కార్యాల‌యానికి చేరుకుంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. రియాతో డ్ర‌గ్స్ చాటింగ్ గురించి అధికారులు ర‌కుల్‌ను ప‌లు కోణాల‌లో  ప్ర‌శ్నించ‌నున్న‌ట్టు స‌మాచారం.  మ‌రోవైపు బాలీ‌వుడ్‌ హీరో‌యిన్‌ దీపికా పదు‌కొనె శనివారం ఎన్సీబీ ఎదుట హాజ‌రు కానుంది. అయితే రకుల్‌ మాదకద్రవ్యాల కేసులో ఇరుక్కోవడంతో  టాలీవుడ్‌లో అలజడి ప్రారంభమైంది. logo