శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Mar 02, 2020 , 23:15:27

60ఏళ్ల వృద్ధుడిగా నటించా!

60ఏళ్ల వృద్ధుడిగా నటించా!

“లండన్‌బాబులు’ తర్వాత  రెగ్యులర్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు కాకుండా వైవిధ్యమైన కథాంశంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. ఆ ఆలోచనతోనే అంగీకరించిన చిత్రమిది. పలాసకు చెందిన మోహన్‌రావు అనే జానపద కళాకారుడిగా కనిపిస్తాను.   18 ఏళ్ల యువకుడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడిగా నాలుగు భిన్న షేడ్స్‌లో నా పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుంది.   వృద్ధుడి పాత్ర కోసం దాదాపు 15 కిలోల బరువు తగ్గాను. తీవ్రమైన ఉద్వేగాలతో కూడిన ఈ పాత్రకు న్యాయం చేయగలనా లేదా అని తొలుత భయపడ్డాను.  సరిగా నటించకపోతే విమర్శలు వస్తాయనిపించింది. ఈ పాత్ర కోసం  శ్రీకాకుళం యాస, డప్పు కొట్టడం నెర్చుకోవడంతో పాటు అలనాటి వేషభాషలు, సామాజిక పరిస్థితుల్ని ఆకళింపు చేసుకొని నటించాను. నటుడిగా ఈ సినిమా  నాకు మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకముంది. 


సుకుమార్‌ ప్రశంసించారు..

దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమా చూసి ‘హీరోలంతా ఈర్ష్య పడే పాత్ర చేశావు. లైఫ్‌ టైమ్‌ గుర్తుండిపోయే సినిమా అవుతుంది’  అని మెచ్చుకున్నారు. ఆయన ప్రశంస మాలో నమ్మకాన్ని పెంచింది. సుకుమార్‌తో పాటు అల్లు అరవింద్‌, నాగశౌర్య,  మారుతి సహా ఇండస్ట్రీలోని చాలా మంది సినిమా బాగుందని అన్నారు.  ఏ సినిమాకు రిఫరెన్స్‌ కాదు. అసురన్‌, గ్యాంగ్‌ ఆఫ్‌ వస్సీఫూర్‌ మాదిరిగా రస్టిక్‌గా ఉంటుంది.   1980 నాటి శైలిని వాస్తవిక కోణంలో ప్రతిబింబిస్తూ పక్కా కమర్షియల్‌ హంగులతో దర్శకుడు కరుణకుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. తదుపరి సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. రెండు కథలు విన్నాను. 

 logo