టాలీవుడ్ స్థాయి పెరిగింది. బాహుబలి సినిమా తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించేందుకు నిర్మాతలు వెనకాడడం లేదు. స్టార్ హీరోలతో పాటు కుర్ర హీరోలు సైతం భారీ బడ్జెట్ చిత్రాలతో సంచలనాలు సృష్టించాలని భావిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ – రమేష్ వర్మ కాంబినేషన్ లో రూపొందిన రాక్షసుడు చిత్రం ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా రాక్షసుడు 2 చిత్రాన్ని ప్రకటించారు.
ఇటీవల ‘హోల్డ్ యువర్ బ్రీత్’ అంటూ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేసి ఆసక్తిని పెంచారు. ‘రాక్షసుడు’ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కోనేరు సత్యనారాయణ సెకండ్ పార్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. సెకండ్ పార్ట్ థ్రిల్లింగ్‌గా ఉంటుందని, హాలీవుడ్‌తో సమానంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలియజేశారు. దీని కోసం 100 కోట్ల బడ్జెట్ ను కేటాయించాము. ఈ సినిమా పూర్తిగా లండన్ లో చిత్రీకరించబడుతుంది.
స్టార్ హీరో ఇందులో లీడ్ రోల్ పోషిస్తున్నారు. సరైన సమయంలో హీరో పేరును ప్రకటిస్తాము” అని వెల్లడించారు. ఎ స్టూడియోస్ సమర్పణలో హవిష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ‘రాక్షసుడు 2’ రూపొందనుంది. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వెంకట్ సి దిలీప్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ మరియు శ్రీకాంత్ విస్సా కలిసి ఈ చిత్రానికి సంభాషణలు రాస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్ – లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. స