శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 12:40:12

అక్ష‌య్ కుమార్ 'ర‌క్షా బంధ‌న్' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అక్ష‌య్ కుమార్ 'ర‌క్షా బంధ‌న్' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అట్రాంగి రే తరువాత, అక్షయ్ కుమార్.. ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ర‌క్షా బంధ‌న్. నేడు రాఖీ పండుగ‌ని పుర‌స్క‌రించుకొని ర‌క్షా బంధ‌న్ చిత్ర ఫ‌స్ట్ ఉల‌క్ విడుద‌ల చేశారు. ఇందులో అక్ష‌య్ ప‌సుపు రంగు కోట్‌లో కనిపిస్తుండ‌గా, ఆయ‌న తోబుట్టువులు అన్న‌ని ఆప్యాయంగా కౌగిలించుకోవ‌డం మ‌నం గ‌మ‌నించ‌వచ్చు. నవంబ‌ర్ 5,2021న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పోస్టర్ ద్వారా ప్ర‌క‌టించారు మేక‌ర్స్

చిత్ర పోస్ట‌ర్‌ని త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా షేర్ చేసిన అక్ష‌య్..  ఈ చిత్ర క‌థ మీ హృద‌యాల‌ని తాకుతుంది. నా కెరీర్‌లో త్వ‌ర‌గా సంత‌కం చేసిన ప్రాజెక్ట్ ఇదే..!  ఈ సినిమా మిమ్మ‌ల్ని న‌వ్వించ‌డంతో పాటు ఏడిపిస్తుంది. నా సోద‌రీమ‌ణులు, సోద‌రుడిగా న‌టించిన వారికి ధ‌న్య‌వాదాలు. ఈ సినిమాని నా సోద‌రి అల్కాకి అంకిత‌మిస్తున్నాను. ఆనంద్‌తో క‌లిసి ఆమె చిత్రాన్ని నిర్మిస్తుండ‌డంతో పాటు స‌మ‌ర్పిస్తుంది అని అక్ష‌య్ పేర్కొన్నారు. ధ‌నుష్‌, సారా అలీ ఖాన్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.logo