మనుషులని మాయ చేసే కేటుగాళ్లు బయట చాలా మందే ఉన్నారు. కాస్త అజాగ్రత్తగా వ్యవహరిస్తే వారి ఉచ్చులో పడడం ఖాయం. తాజాగా బుల్లితెర పాపులర్ షో జబర్ధస్త్ కార్యక్రమం పేరుతో బయట చాలా మోసాలు జరుగుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటూ రాకేష్ హెచ్చరిస్తున్నాడు. ముఖ్యంగా తన టీంలో పిల్లలకు ఛాన్స్ ఇప్పిస్తామని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని రాకేష్ ఓ వీడియో ద్వారా తెలియజేశాడు.
జబర్ధస్త్ రాకేష్ ..యోధ, దీవెన లాంటి చిన్న పిల్లలతో కలిసి ఆసక్తికర స్కిట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది గమనించిన కొందరు కేటుగాళ్లు రాకేష్ పేరు చెప్పి, పిల్లలకు అవకాశాలు ఇస్తున్నామని వారి దగ్గర డబ్బులు గుంజుతున్నారు.జబర్దస్త్‌లోకి రావాలనుకునే వాళ్లు ఏం చేయాలి.. ఎలా చేయాలి అనేది ఓ వీడియో పోస్ట్ చేసాడు రాకేష్. న్యాయబద్ధంగా మాత్రమే జబర్ధస్త్‌లోకి రావాలి తప్ప, అవకాశాలు ఇచ్చే వారు ఎవరు డబ్బులు అడగరు అంటూ రాకేష్ ఓ వీడియో ద్వారా తెలియజేశాడు.