గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 00:17:16

వాస్తవికతతో ‘రాజు యాదవ్‌'

వాస్తవికతతో ‘రాజు యాదవ్‌'

గెటప్‌ శ్రీను కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజు యాదవ్‌' శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వరుణవి క్రియేషన్స్‌ పతాకంపై ప్రశాంత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కృష్ణమాచారి దర్శకుడు. అంకిత కరత్‌ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి యువ దర్శకుడు సాగర్‌ కె చంద్ర క్లాప్‌నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఒక టౌన్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ ఇది. సహజసిద్ధమైన పాత్రలతో వాస్తవికతను ప్రతిబింబిస్తూ సాగుతుంది. సమాజంలో మనం నిత్యం చూసే సంఘటనలు, సగటు కుటుంబంలోని విభిన్నమైన మనస్తత్వాలు..వారి ఊహలు..కోరికలు..చివరకు వారందరి గమ్యం ఏమిటన్నదే చిత్ర ఇతివృత్తం’ అన్నారు. ఉత్తమమైన నటనను ప్రదర్శించడానికి ఆస్కారమున్న కథాంశమిదని గెటప్‌ శ్రీను ఆనందం వ్యక్తం చేశారు. డిసెంబర్‌ మొదటివారం నుంచి షూటింగ్‌ జరుపుతామని నిర్మాత తెలిపారు. ఆనంద్‌చక్రపాణి, రూపాలక్ష్మి, ఉన్నతి, ఉత్తర ప్రశాంత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిరామ్‌ ఉదయ్‌, సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, దర్శకుడు: కృష్ణమాచారి.