యువ హీరో రాజ్ తరుణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ స్టాండ్ అప్ రాహుల్. స్టాండ్ అప్ కామిడ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీ టీజర్ ను టాలీవుడ్ హీరో రానా విడుదల చేశాడు. సాంటో మోహన్ డైరెక్టర్ గా పరిచయమవుతుండగా..ఈ చిత్రాన్ని ఇంట్రెస్టింగ్ కామిడ్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇప్పటివరకు లవర్ బాయ్ గా కనిపించిన రాజ్ తరుణ్ ఈ సారి న్యూ లుక్‌తో ప్రేక్షకులకు మంచి ఫీల్ గుడ్ మూవీ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు టీజర్ చూస్తే తెలిసిపోతుంది.
వెన్నెల కిశోర్ మరోసారి తన కామెడీ స్టైల్‌తో అందరిని నవ్వించేందుకు రెడీ అవుతున్నాడు. స్టాండప్ కామిక్ టైమింగ్ ఉన్న యువకుడు జీవితంలో దేనిపై సరిగ్గా నిలబడకుండా..నిజమైన ప్రేమను తెలుసుకుని తల్లిదండ్రుల కోసం ఎలా నిలబడతాడనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాడు డైరెక్టర్. వర్ష బొల్లమ్మ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పై నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
నో ఓటీటీ..సిల్వర్ స్క్రీన్ పైనే ‘నారప్ప’ సందడి..!
ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్ లో వస్తున్న తెలుగు సినిమాలివే..!
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?