గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 18:03:17

సెట్స్ లో రాజ్‌కుమార్ రావు‌, భూమి షేక్ హ్యాండ్‌

సెట్స్ లో రాజ్‌కుమార్ రావు‌, భూమి షేక్ హ్యాండ్‌

ఆయుష్మాన్ ఖురానా, స‌న్యా మ‌ల్హోత్రా కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రం బ‌ఢాయ్ హో. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కుల‌క‌ర్ణి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఇపుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా బ‌ఢాయ్ దో తెర‌కెక్కుతుంది. బాలీవుడ్ స్టార్లు రాజ్‌కుమార్ రావు, భూమి పెడ్నేక‌ర్ లీడ్ రోల్స్ లో న‌టిస్తున్నారు. షూటింగ్ లొకేష‌న్ లో జాయిన్ అయిన ఫొటోను ట్విట‌ర్ లో షేర్ చేసింది భూమి. బ‌ఢాయ్ దో సెట్స్ లో 2021 జ‌న‌వ‌రిలో జాయిన్ అవుదామంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

మ‌రోవైపు రాజ్‌కుమార్ రావు భూమి పెడ్నేక‌ర్  కు షేక్ హ్యాండ్ ఇస్తున్న‌ స్టిల్ ను ట్విట‌ర్ లో పోస్ట్ చేశాడు. భూమి పెడ్నేక‌ర్ దుర్గావతి చిత్రంలో న‌టిస్తోంది. ఇటీవ‌లే డ‌బ్బింగ్ పూర్త‌యిన‌ట్టు ఓ ఫొటో కూడా షేర్ చేసింది. ప్రియాంక చోప్రాతో క‌లిసి నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్టు ది వైట్ టైగ‌ర్ లో న‌టిస్తున్నాడు రాజ్ కుమార్ రావు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo