గురువారం 28 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 10:00:24

అంద‌రి క‌ళ్ళు ర‌జ‌నీకాంత్ వైపే... ఈ సారైన క్లారిటీ ఇస్తారా!

అంద‌రి క‌ళ్ళు ర‌జ‌నీకాంత్ వైపే... ఈ సారైన క్లారిటీ ఇస్తారా!

అదుగో పులి, ఇదుగో మేక అన్న‌ట్టు ఉంది ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ వ్య‌వ‌హారం. త‌మిళ‌నాట రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్న నేప‌థ్యంలో ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తాడ‌ని , ఆయ‌న వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు చెబుతూనే ఉన్నారు. కాని త‌లైవా మాత్రం ఏ మాత్రం క్లారిటీ రావ‌డం లేదు. అయితే ఈ రోజు ప‌క్కా క్లారిటీ ఇస్తాడని దేశ‌మంతా ఎదురు చూస్తుంది.  రజనీ మక్కల్‌ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో రజనీకాంత్‌ రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా భేటీ కానున్నారు. దాదాపు తొమ్మిది గంట‌ల పాటు వారితో చ‌ర్చించాక త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలుస్తుంది.

 2017 డిసెంబర్‌ 31న రజనీకాంత్ రాజ‌కీయాల‌లోకి రాబోతున్నాన‌ని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత రజనీ మక్కల్‌ మండ్రం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదు వంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. కాని పార్టీ ప్ర‌క‌ట‌న అనేది జర‌గ‌లేదు. ఈ ఏడాది అక్టోబ‌ర్ లో ప్ర‌క‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ క‌రోనా వ‌ల‌న ఆయ‌న వెన‌క్కి త‌గ్గిన‌ట్టు తెలుస్తుంది. అనారోగ్య కార‌ణాల వ‌ల‌న ఎలాంటి రిస్క్ తీసుకోవ‌ద్ద‌ని ర‌జ‌నీ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఏదేమైన మ‌రి కొద్ది గంట‌ల‌లో ర‌జ‌నీ రాజ‌కీయ ప‌య‌నంకు సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది

తాజావార్తలు


logo