శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 12:35:03

పార్టీ ప్ర‌క‌ట‌న‌పై ర‌జ‌నీకాంత్ అఫీషియ‌ల్ స్టేట్‌మెంట్‌

పార్టీ ప్ర‌క‌ట‌న‌పై ర‌జ‌నీకాంత్ అఫీషియ‌ల్ స్టేట్‌మెంట్‌

ఎన్నాళ్ళ నుండో వేచి చూస్తున్న క్ష‌ణం రానే వ‌చ్చింది. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత తొల‌గిపోయింది. ర‌జ‌నీకాంత్ పార్టీ పెడ‌తాడా లేదా అనే మీమాంస‌లో ఉన్న స‌మ‌యంలో తాను డిసెంబ‌ర్ 31న పార్టీ ప్ర‌క‌టన చేస్తాన‌ని, జ‌న‌వ‌రిలో పార్టీ లాంచింగ్ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని తెలిపారు. ర‌జ‌నీకాంత్ నిర్ణ‌యంతో త‌మిళ‌నాట రాజ‌కీయం మ‌రింత వేడెక్క‌నుంద‌ని తెలుస్తుంది.

కిడ్నీ మార్పిడి వ‌ల‌న ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల‌లోకి రాడ‌ని, ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో త‌లైవా చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో తన పార్టీ రజనీ మక్కళ్‌ మండ్రం (ఆర్‌ఎంఎం) జిల్లా కార్యదర్శులతో  సమావేశమై చర్చించారు. అనంతరం పోయెస్‌ గార్డెన్‌లోని తన నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడారు. వాళ్ల (ఆర్‌ఎంఎం కార్యదర్శులు) అభిప్రాయాలను వాళ్లు చెప్పారని, తన అభిప్రాయాన్ని తాను తెలియజేశానని రజినీ తెలిపారు. ‘నా నిర్ణయం ఏదైనా సరే నా వెంటే ఉంటానని వాళ్లు చెప్పారు. నా నిర్ణయాన్ని వీలైనంత త్వరగా వెల్లడిస్తాన’ని చెప్పారు. 


logo