బుధవారం 03 జూన్ 2020
Cinema - May 13, 2020 , 16:29:34

రజినీకాంత్‌ 'అన్నాతే' సినిమా రిలీజ్‌ వాయిదా

రజినీకాంత్‌ 'అన్నాతే' సినిమా రిలీజ్‌ వాయిదా

రజినీకాంత్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అన్నాతె' సినిమా వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్టు సన్‌ పిక్చర్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సినిమాను ముందుగా దీపావళికి రిలీజ్‌ చేయాలని భావించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల 2021 పొంగల్‌కు విడుదల చేయనున్నట్టు  సన్‌ పిక్చర్స్‌ వెల్లడించింది. శివ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమాలో రజినీకాంత్‌ సరసన కీర్తీ సురేశ్‌, మీనా, కుష్భూ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. రజినీకాంత్‌ చివరగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం  వహించిన  దర్బార్‌ సినిమాలో నటించారు. 


logo