బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 02:11:42

రజనీకాంత్‌ కీర్తిగీతం

రజనీకాంత్‌ కీర్తిగీతం

క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఫ్రెండ్‌షిప్‌'.   జాన్‌పాల్‌రాజ్‌, శ్యామ్‌సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జేపీఆర్‌, స్టాలిన్‌ నిర్మిస్తున్నారు. లోస్లియా మరియనేసన్‌ కథానాయిక. ఈ చిత్రంలోని రజనీకాంత్‌ ఆంథెమ్‌ను  హీరో లారెన్స్‌ ఇటీవల విడుదలచేశారు. రాజశ్రీసుధాకర్‌ సాహిత్యాన్ని అందించిన ఈ గీతానికి డి.ఎం. ఉదయ్‌కుమార్‌ సంగీతాన్ని సమకూర్చారు. హేమచంద్ర ఆలపించారు. హర్భజన్‌సింగ్‌ మాట్లాడుతూ ‘రజనీకాంత్‌ సినీ ప్రయాణాన్ని కీర్తిస్తూ సాగిన ఈ గీతం శ్రోతల్ని మెప్పిస్తున్నది. అన్ని భాషల్లో ట్రెండింగ్‌ లిస్ట్‌లో టాప్‌గా నిలిచింది.  స్నేహం, ప్రేమ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం’ అని తెలిపారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రంలో అర్జున్‌, సతీష్‌ కీలక పాత్రల్ని పోషించనన్నారు. 

తాజావార్తలు


logo