బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 25, 2021 , 19:27:43

రజినీకాంత్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!

రజినీకాంత్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న రజినీకాంత్..సినిమాలకు కూడా దూరంగానే ఉన్నాడు. ఈ కారణంతోనే ఈయన రాజకీయాలకు కూడా శాశ్వతంగా దూరమైపోయాడు. తను పాలిటిక్స్ చేయలేనని చెప్పేసాడు. అనారోగ్యం కారణంగా మానసిక ఒత్తిడికి లోను కాలేనని చెప్పాడు సూపర్ స్టార్. ఇదిలా ఉంటే దీనికంటే ముందే గతేడాది ఈయన శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమాకు కమిటయ్యాడు. ఆ సినిమా షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. మొన్నటి వరకు కూడా హైదరాబాద్ లోనే షూటింగ్ జరిగింది. అయితే ఉన్నట్లుండి అనారోగ్యం పాలు కావడంతో చెన్నై వెళ్లిన రజినీ అక్కడే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంటి నుంచి బయటికి కూడా రావడం లేదు.

దాంతో శివ కూడా మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇదిలా ఉంటే అన్నాత్తే సినిమా ఆగిపోయిందని కొందరు.. కాదు ఆలస్యం అవుతుందని మరికొందరు చెప్పారు. ఇప్పుడు రెండో మాటే నిజమైంది. 2021 సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమా కాస్తా ఇప్పుడు నవంబర్ కు వెళ్లిపోయింది. దివాళీ కానుకగా అన్నాత్తే విడుదల కానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. నవంబర్ 4, 2021న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసారు సన్ పిక్చర్స్. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం వస్తుంది. 

వేదాళం, విశ్వాసం లాంటి వరస విజయాలతో దూసుకుపోతున్న శివ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో రజినీ అభిమానులు కూడా నమ్మకంగానే ఉన్నారు. అన్నాత్తే కచ్చితంగా రజినీ కోరికను నెరవేరుస్తుందని.. హిట్ లోటు భర్తీ చేస్తుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రజినీ ఇంట్రో సాంగ్ దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. డి ఇమాన్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో రజినీకాంత్ కు చాలా ఇంట్రో సాంగ్స్ పాడారు బాలు. అలాగే అన్నాత్తే కూడా గతేడాది లాక్ డౌన్ కు ముందుగానే రికార్డ్ చేసాడు ఇమాన్. ఈ పాటను కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo