e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home సినిమా శివానీకి బంపర్‌ ఆఫర్‌

శివానీకి బంపర్‌ ఆఫర్‌

శివానీకి బంపర్‌ ఆఫర్‌

సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ముద్దుల తనయ శివానీ రాజశేఖర్‌ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తొలి చిత్రం విడుదలకాకముందే చక్కటి ఆఫర్లను చేజిక్కించుకోవడం విశేషమని చెబుతున్నారు. తెలుగులో ప్రస్తుతం ఈ యువనాయకి ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ చిత్రంతో పాటు తేజ సజ్జాతో కలిసి ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. తమిళంలో హిప్‌హాప్‌ తమిళ సరసన ఓ సినిమా చేస్తోంది. తాజాగా శివానీ రాజశేఖర్‌ తమిళంలో భారీ ఆఫర్‌ను సొంతం చేసుకుంది. హిందీలో విమర్శకులు ప్రశంసలందుకున్న సామాజిక సందేశాత్మక ‘ఆర్టికల్‌ 15’ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో ఉదయనిధిస్టాలిన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. అరుణ్‌రాజ కామరాజ్‌ దర్శకుడు . బోనీకపూర్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో శివానీరాజశేఖర్‌ కీలక పాత్రలో నటించనుందని సమాచారం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శివానీకి బంపర్‌ ఆఫర్‌

ట్రెండింగ్‌

Advertisement