మంగళవారం 26 జనవరి 2021
Cinema - Oct 30, 2020 , 09:06:25

మోనాల్‌ని రేష‌న్ మేనేజ‌ర్‌గా చేసినందుకు ర‌చ్చ చేసిన మాస్ట‌ర్

మోనాల్‌ని రేష‌న్ మేనేజ‌ర్‌గా చేసినందుకు ర‌చ్చ చేసిన మాస్ట‌ర్

హౌజ్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసే అవ‌కాశం రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్‌కు రావ‌డంతో ఆయ‌న అరియానాని ఎన్నుకున్నాడు. మ‌రోసారి నీకు స‌పోర్ట్‌గా ఉంటానంటూ మోనాల్‌తో చెప్పాడు. అయితే కెప్టెన్‌గా ఎంపికైన అరియానా రేష‌న్ మేనేజ‌ర్‌గా మోనాల్ గజ్జర్ ని నియ‌మించింది. దీంతో మాస్ట‌ర్ కోపం క‌ట్టలు తెంచుకుంది. మీరు త‌ర్వాత టైంలో మోనాల్‌కు స‌పోర్ట్‌గా ఉంటార‌ని అన్నందునే మోనాల్‌కు రేష‌న్ మేనేజ‌ర్‌గా నియ‌మించాన‌ని అరియానా అంటుండ‌గా, ఆమెతో వాగ్వాదానికి దిగాడు. 

నువ్వు మోనాల్‌ని రేష‌న్ మేనేజ‌ర్‌ని ఎందుకు ఎంపిక చేశావు అని అరియానాని ప్ర‌శ్నించాడు. విశ్వాసం లేకుండా చేశావు అంటూ అవినాష్‌, మెహ‌బూబ్‌ల ద‌గ్గ‌ర త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్త‌ప‌రిచాడు. అరియానా స‌మాధానం ఇస్తున్న‌ప్ప‌టికీ దానిని ప‌ట్టించుకోకుండా ఆయ‌న ఏం చెప్పాల‌నుకున్నాడో అదే చెబుతూ గ‌ట్టిగ‌ట్టిగా అరిచాడు. ఇది గ‌మ‌నించిన మోనాల్ ఇది రియాలిటీ అంటూ అఖిల్‌తో చెప్ప‌సాగింది. 

అనంతరం మోనాల్.. అవినాష్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఫ్రూట్స్ వేస్ట్ అయ్యాయి అని చెప్పింది. అంతకు ముందు రేషన్ మేనేజర్‌గా ఉన్న అరియానా సరిగా చూడలేనందుకువల్లే ఇలా జరిగిందని మోనాల్ చెప్పుకొచ్చింది. అరియానాని ఇంటి స‌భ్యులు ప్ర‌శ్నిస్తుండ‌గా,రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ తెగ ఆనందించాడు. త‌న మాట విన‌కుండా మోనాల్‌ని నియ‌మించినందుకు తగిన శాస్తే జరిగింది అన్న‌ట్టు ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చాడు. 


logo