శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 17, 2020 , 13:50:42

రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీకి క‌రోనా..!

రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీకి క‌రోనా..!

క‌రోనా మ‌హ‌మ్మారి  సెల‌బ్రిటీల‌ని సైతం వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. యాంగ్రీయంగ్‌మెన్ రాజ‌శేఖ‌ర్ కుటుంబం కూడా క‌రోనా బారిన ప‌డింది. తాజాగా రాజ‌శేఖ‌ర్  ట్విట్ట‌ర్ ద్వారా త‌న‌తో పాటు త‌న భార్య జీవిత‌, కుమార్తెలు శివాని, శివాత్మిక‌లు కరోనా సోకిన విష‌యాన్ని వెల్ల‌డించారు

నాకు, జీవితకు, పిల్లలకు కరోనా సోకిన మాట నిజమే. ప్రస్తుతం హాస్పిటల్‌లో చిక్సిత తీసుకుంటున్నాం.  శివాని, శివాత్మిక క‌రోనా నుండి కోలుకున్నారు . నేను, జీవిత ఇంకా చికిత్స తీసకుంటున్నాం. ఇప్పుడు మా ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే ఇంటికొచ్చేస్తాం  అని స్ప‌ష్టం చేశారు రాజశేఖర్‌.


logo