సోమవారం 30 నవంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 10:22:45

క్లిష్టంగా రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం.. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధ‌న‌లు

క్లిష్టంగా రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం.. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధ‌న‌లు

క‌రోనా  ప్ర‌‌జ‌ల జీవితాల‌ని ఛిన్నాభిన్నం చేసింది. ఈ మ‌హ‌మ్మారి వ‌ల‌న చాలా మంది ఆర్ధికంగా కుదేల‌య్యారు. కొంద‌రు ప్రాణాలు కూడా కోల్పోయారు. సినీ సెల‌బ్రిటీలు సైతం క‌రోనా వ‌ల‌న వ‌ణికిపోతున్నారు. ఇప్ప‌టికే క‌రోనాతో లెజండ‌రీ సింగ‌ర్ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌న్నుమూయ‌గా, ఇప్పుడు సీనియ‌ర్ న‌టుడు రాజ‌శేఖ‌ర్ క‌రోనాతో ఫైట్ చేస్తున్నారు.

ఇటీవ‌ల త‌న ట్విట్ట‌ర్ ద్వారా  ఫ్యామిలీ అంతా క‌రోనా బారిన ప‌డ్డ‌ట్టు తెలిపారు రాజ‌శేఖ‌ర్ . త‌న ఇద్ద‌రు కూతుళ్ళు కోలుకున్నార‌ని, త‌న‌తో పాటు త‌న భార్య ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు రాజ‌శేఖ‌ర్.  అయితే ప్ర‌స్తుతం రాజ‌శేఖ‌ర్ఆరోగ్య ప‌రిస్థితి కాస్త  క్లిష్టంగా మారిందని ఆయ‌న కుమార్తె శివాత్మిక ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. 

నాన్న కాస్త క‌ష్టంగా క‌రోనాతో పోరాడుతున్నారు. మీ ప్రేమ‌, అభిమానం, ప్రార్ధ‌న‌లు ఆయ‌నని కాపాడ‌తాయ‌ని భావిస్తున్నాము. నాన్న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌తి ఒక్కరిని ప్రార్ధిస్తున్నాను. మీ ప్రేమ‌తో ఆయ‌న క్షేమంగా తిరిగి వ‌స్తార‌ని ఆశిస్తున్నాను అంటూ శివాత్మిక త‌న ట్వీట్‌లో పేర్కొంది.