శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 16:02:59

రాజశేఖర్‌కు ప్లాస్మా చికిత్స

రాజశేఖర్‌కు ప్లాస్మా చికిత్స

టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో రాజ‌శేఖర్ కొద్ది రోజుల క్రితం కరోనాతో హైద‌రాబాద్‌లోని సిటీ న్యూరో సెంట‌ర్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. తాజాగా రాజ‌శేఖ‌ర్‌కు సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.  ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. చికిత్స‌కు స్పందిస్తున్నారు. ప్లాస్మా థెర‌పీని అందిస్తున్నాం. ప్ర‌త్యేక వైద్య బృందం అతని ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తున్నారు అని వైద్యులు పేర్కొన్నారు. 

రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ అంతా క‌రోనా బారిన ప‌డ‌గా, ఆయ‌న ఇద్ద‌రు కూతుళ్లు శివానీ,శివాత్మిక త్వ‌ర‌గానే కోలుకున్నారు. జీవిత‌కు రీసెంట్‌గా నెగెటివ్ రావ‌డంతో ఆమెను డిశ్చార్జ్ చేశారు.  అభిమానులు, ప్ర‌ముఖుల రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు.