మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 16:03:38

బాలు మృతిపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ర‌జ‌నీకాంత్

బాలు మృతిపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ర‌జ‌నీకాంత్

ఏ ఒక్క భాష‌కే ప‌రిమితం కాకుండా భార‌తదేశంలోని అన్ని భాష‌ల‌లో అనేక పాట‌లు పాడిన ఎస్పీ బాలు ఈ రోజు చెన్నైలోని ఎంజీఎం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఆయ‌న మృతిపై సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు. ఆయ‌న మృతితో సంగీత ప్రపంచం మూగ‌బోయింది. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ బాలు మృతిపై విచారం వ్య‌క్తం చేశారు. 

ఓ వీడియో ద్వారా మాట్లాడిన ర‌జ‌నీకాంత్‌.. మీరు ఎన్నో ఏళ్ళు నా గొంతుక‌గా మారారు. మీ జ్ఞాప‌కాలు ఎప్ప‌టికీ నాతో ఉంటాయి. బాలు పాట‌కు, ఆయ‌న వాయిస్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.  సినీ ప్రపంచం రఫీగారు, కిషోర్‌ కుమార్‌గారు, ఘంటశాలగారు, టి.ఎం.సుందర్‌రాజన్‌గారు ఇలా ఎంతో మంది గొప్ప గాయకులను చూసింది. వీరిని మించిన గొప్ప‌త‌నం బాలులో ఉంది. 

మిగతా వారంద‌రు వారివారి మాతృబాషల‌లో పాట‌లు పాడ‌గా, బాలు మాత్రం  అన్నీ భాషల్లో పాటలు పాడారు. కాబట్టి బాలుగారంటే ఇండియాలో చాలా మందికి తెలుసు. ముఖ్యంగా దక్షిణాదిలో ఆయన అభిమానులు కానీ వారుండరు. తీయ‌ని స్వరాన్ని ఎలా మ‌ర‌చిపోగ‌లం. ఆయ‌న ఇక లేర‌నే విష‌యం బాధ‌గా ఉంది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తూ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని ర‌జ‌నీకాంత్ పేర్కొన్నారు.


logo