శనివారం 04 జూలై 2020
Cinema - Feb 05, 2020 , 09:01:29

ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ప్రారంభించ‌నున్న రాజ‌మౌళి, ప్ర‌భాస్

ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ప్రారంభించ‌నున్న రాజ‌మౌళి, ప్ర‌భాస్

రాజమౌళి, ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన బాహుబ‌లి చిత్రం ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఇప్పుడు వీరిద్ద‌రు మ‌రోసారి క‌ల‌వ‌బోతున్నారు. అయితే ఈ సారి నిర్మాతలుగా మారి వైవిధ్య‌మైన చిత్రాల‌ని నిర్మించాల‌ని రాజ‌మౌళి- ప్ర‌భాస్ కాంబో భావిస్తుంద‌ట‌. అతి త్వ‌ర‌లోనే కొత్త ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ని ప్రారంభించి త‌మ బేన‌ర్‌లో రూపొంద‌బోయే తొలి సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కించాల‌ని వారు అనుకుంటున్నార‌ట‌. ఈ వార్త‌కి సంబంధించి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రభాస్ .. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జాన్ ( వ‌ర్కింగ్ టైటిల్‌) అనే చిత్రం చేస్తున్నాడు. 


logo