గురువారం 28 మే 2020
Cinema - May 16, 2020 , 22:21:30

జన్మదిన కానుకగా..

జన్మదిన కానుకగా..

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు చారిత్రక ఇతివృత్తానికి కాల్పనిక అంశాల్ని జోడిం చి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. లాక్‌డౌన్‌ కార ణంగా చిత్రీకరణ వాయి దా పడింది. ఇందులో కొమరంభీంగా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి నెలలో విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇందులో ఎన్టీఆర్‌ను జలానికి, రామ్‌చరణ్‌ను అగ్నికి ప్రతీకలా చూపించారు. ఈ నెల 20న ఎన్టీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరో మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇందులో ఎన్టీఆర్‌ పోషిస్తున్న కొమరం భీం పాత్రను పరిచయం చేయబోతున్నారు. దీనికి రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ అందిస్తారని సమాచారం. ఈ చిత్రంలో అలియాభట్‌, ఒలివియా మోర్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు.logo