శుక్రవారం 29 మే 2020
Cinema - Mar 21, 2020 , 09:52:07

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత‌ ఇస్మార్ట్ హీరోతో..!

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత‌ ఇస్మార్ట్ హీరోతో..!

ద‌ర్శ‌క  ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌నేది ఇప్ప‌టి హీరోల క‌ల‌. త్వ‌ర‌లో ఆ క‌ల‌ని నెర‌వేర్చుకోబోతున్నాడు మ‌న ఇస్మార్ట్ హీరో రామ్‌. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో భారీ విజ‌యం సాధించిన రామ్ ప్ర‌స్తుతం రెడ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

భారీ బ‌డ్జెట్ చిత్రం త‌ర్వాత స్మాల్ బ‌డ్జెట్‌లో సినిమా చేయాల‌ని రాజ‌మౌళి భావిస్తున్న‌ట్టు ఆ మ‌ధ్య ప‌లు వార్త‌లు వచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్న జ‌క్క‌న్న ఈ సినిమా పూర్తైన త‌ర్వాత రామ్ హీరోగా మీడియం బ‌డ్జెట్ సినిమా చేయ‌నున్నాడ‌ట‌. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని ఇప్ప‌టికే త‌న తండ్రిని ఆదేశించాడని స‌మాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. 


logo