ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 03, 2020 , 16:25:35

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై స్పందించిన‌ రాజ‌మౌళి

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై స్పందించిన‌ రాజ‌మౌళి

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాలు దాటించిన ద‌ర్శ‌కుడు ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం రౌద్రం రణం రుధిరం( ఆర్ఆర్ఆర్) అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా  రామ్‌చరణ్ నటిస్తోన్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది చివ‌రలో విడుద‌ల కావ‌ల‌సి ఉన్న ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

క‌రోనా వ‌ల‌న ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ‌త కొద్ది రోజుల నుండి షూటింగ్స్ ప‌నులు జ‌రుగుతున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా ఇప్పుడిప్పుడే ఊపు అందుకున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ విష‌యానికి వ‌స్తే  వి.ఎఫ్‌.ఎక్స్‌ స్టూడియోస్ అన్ని మూసివేసి ఉండ‌డంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా అంత‌గా జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తుంది. ఇక సినిమా షూటింగ్ ఎలా చేయాల‌నే దానిపై ప్ర‌స్తుతం చాలా హోం వ‌ర్క్ చేస్తున్నార‌ట రాజ‌మౌళి. అతి త్వ‌ర‌లోనే చిత్ర షూటింగ్ చేస్తామ‌ని అంటున్నారు.

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ముందుగా ఈ ఏడాది రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కాని కొన్ని కార‌ణాల వ‌లన వ‌చ్చే ఏడాది జన‌వ‌రికి వాయిదా వేశారు. ఇప్పుడు క‌రోనా వ‌ల‌న  మ‌రోసారి వాయిదా ప‌డింది. అయితే క‌రోనా వ‌ల‌న కొన్ని ప‌ద్ధ‌తుల‌లో షూటింగ్ చేయాల‌నుకుంటున్న‌ప్ప‌డు  ప్రాక్టిక‌ల్ స‌మ‌స్య‌లు కూడా తెలుసుకోవాలి. 

ప్ర‌స్తుతం రెండు నెల‌లు షూటింగ్ చేయాల‌నుకుంటున్నాం. ఆ రెండు నెల‌లు మూవీ షూటింగ్ సజావుగా జ‌రిగేలా చూసుకోవాలి. త్వ‌ర‌లోనే చిత్ర రిలీజ్ డేట్‌పై ఓ నిర్ణ‌యానికి వ‌స్తాం అని జ‌క్క‌న్న పేర్కొన్నారు. ఇక సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత అలియాపై ఎంతో నెగిటివిటీ పెరిగింది. ఇది త‌న సినిమాపై ఎఫెక్ట్ చూప‌దంటున్నాడు రాజ‌మౌళి. అలియా మంచి న‌టి. మా సినిమాలోని పాత్ర‌కు వంద‌శాతం సూట్ అవుతుంద‌ని ఎంపిక చేశాం. త‌ను ఎగ్జైట్ అయి సినిమాలో న‌టించేందుకు ఆస‌క్తి చూపింది అని త‌న అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు ద‌ర్శ‌క ధీరుడు.


logo