సినీ ప్రేక్షకులు అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఆర్ఆర్ఆర్ ఒకటి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అక్టోబర్ 13న సినిమాను విడుదల చేసేందుకు రాజమౌళి అండ్ టీం తీవ్ర కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తుండగా, ఇక ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయబోతున్నారు.
మరి కొద్ది నిమిషాలలో ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి మేకింగ్ వీడియో విడుదల చేయనున్నారు. ఈ వీడియో అంచనాలని మించేలా ఉంటుందట. అలానే రానున్న రోజులలో ప్రమోషనల్ గీతాన్ని విడుదల చేయనుండగా, ఈ గీతంలో రాజమౌళితో పని చేసిన హీరోలు ప్రభాస్, రవితేజ, సునీల్, నాని, నితిన్ కనిపించనున్నారట. ఇప్పటికే ఈ పాటకి సంబంధించి కీరవాణి ఓ మంచి ట్యూన్ సిద్ధం చేశాడని, త్వరలోనే ఈ పాటని తెరకెక్కించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.