గురువారం 04 జూన్ 2020
Cinema - May 06, 2020 , 08:57:23

ఆర్ఆర్ఆర్‌లో అలియా పాత్ర‌పై వ‌చ్చిన క్లారిటీ..!

ఆర్ఆర్ఆర్‌లో అలియా పాత్ర‌పై వ‌చ్చిన క్లారిటీ..!

టాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్(రౌద్రం రుధిరం రణం). యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా భ‌ట్‌, ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలీవియో మోరిస్ కథా‌నాయిక‌గా న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న విడుద‌ల కానున్న ఈ చిత్రంకి సంబంధించి అభిమానుల‌లో అనేక సందేహాలు నెల‌కొన‌గా, తాజాగా అలియా పాత్రపై చిన్న క్లారిటీ ఇచ్చారు జ‌క్క‌న్న‌.

సీత పాత్రకు ఆలియా భట్‌ను ఎందుకు ఎంపిక చేసుకున్నామో రాజమౌళి తాజాగా వివ‌రించారు.  సీత పాత్ర కోసం  తారక్, చరణ్ మధ్య నిలబడగలిగే నటి నాకు కావాలి. ఎందుకంటే వాళ్లిద్దరూ ఎంతో ప్రతిభ కలిగిన నటులు.  సీత అమాయకంగా ఉండాలి. దాడి చేసే విధంగా ఉండాలి. చాలా హుషారుగా ఉండాలి. అందుకనే ఈ పాత్ర కోసం ఆలియా భట్‌ను ఎంపిక చేసుకున్నాను. అలా అని ఇది త్రికోణ ప్రేమకథ కాదు’’ అని రాజమౌళి వెల్లడించారు. చిత్రంలో అలియా రామరాజు మరదలు సీతగా క‌నిపించి సంద‌డి చేయ‌నుంది. 


logo