e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home News రూటు మార్చిన రాజమౌళి..ఈ సారి మరో మ్యూజిక్ డైరెక్ట‌ర్ కూడా

రూటు మార్చిన రాజమౌళి..ఈ సారి మరో మ్యూజిక్ డైరెక్ట‌ర్ కూడా

రాజమౌళి సినిమాకు సంగీత దర్శకుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 20 ఏళ్లుగా ఆయన సినిమాలకు ఒక్కడే సంగీత దర్శకుడు. అతడే కీరవాణి.. బ్రదర్ అఫ్ రాజమౌళి. తన అన్నయ్య తప్ప మరో సంగీత దర్శకుడితో ఇప్పటివరకు పని చేయలేదు రాజమౌళి. మరో అన్నయ్య కల్యాణి మాలిక్ మాత్రం కొన్ని సినిమాలకు నేపథ్య సంగీతం అందించాడు. అది మినహా ఇప్పటి వరకూ ప్రతి సినిమాకు కీరవాణి మాత్రమే సంగీతం అందిస్తూ వస్తున్నాడు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత తొలిసారి కీరవాణి కాకుండా మరో సంగీత దర్శకుడు కూడా రాజమౌళి సినిమాకు పని చేస్తున్నాడు. అతడే అనిరుధ్‌ రవిచందర్.

సౌత్ ఇండియాలో ప్రస్తుతం నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రం తిప్పుతున్నాడు అనిరుధ్‌. తెలుగులో కూడా పవన్ కళ్యాణ్, నాని లాంటి స్టార్ హీరోలతో పని చేశాడు. ఇప్పటివరకు తమిళ ఇండస్ట్రీ పైనే ఫోకస్ పెట్టాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు పనిచేసే అరుదైన అవకాశం అనిరుధ్ కు వచ్చింది. ఈ సినిమాకు కూడా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. అయితే ఇది పాన్ ఇండియా సినిమా.. దాంతో అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సంగీతం అందించాల్సి ఉంటుంది. దీని కోసమే తమిళ వెర్షన్ ప్రమోషనల్ సాంగ్ కోసం అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

దీనికోసం ప్రత్యేకంగా ఒక సెషన్ ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. ఇది పూర్తయిన తర్వాత సోషల్ మీడియాలో దీని గురించి ట్వీట్ చేశాడు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. అనిరుధ్‌ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని.. ఎంతో అద్భుతమైన టాలెంట్..డౌన్ టూ ఎర్త్ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. తమిళ వెర్షన్ ప్రమోషన్ కోసం త్రిబుల్ ఆర్ సినిమాలో ఒక పాట ఉండబోతుంది. దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఏదేమైనా తన సినిమా కోసం అన్నయ్య కీరవాణి కాకుండా మరో సంగీత దర్శకుడితో పని చేయడం ఇదే తొలిసారి. భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్ణయాలు రాజమౌళి తీసుకుంటారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి..

శాకుంత‌లంలో పాపుల‌ర్ టీవీ హోస్ట్

టైగ‌ర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖ‌ర్చు..!

కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వ‌చ్చాడు..‘తిమ్మ‌రుసు’ ట్రైల‌ర్

ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్ర‌మే తెలుసు: స‌త్య‌దేవ్‌

త‌రుణ్‌, ఉద‌య్‌కిర‌ణ్‌తో న‌న్ను పోల్చొద్దు: వ‌రుణ్ సందేశ్‌

ప్రియ‌మణి-ముస్త‌ఫారాజ్ వివాహం చెల్ల‌దు..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana