టాలీవుడ్ (Tollywood) యువ హీరో కార్తికేయ (Kartikeya) గుమ్మకొండ నటిస్తున్న తాజా చిత్రం రాజా విక్రమార్క (Raja Vikramarka) . ఈ మూవీ నుంచి మొదటి పాటను మేకర్స్ విడుదల చేశారు. స్పై థ్రిల్లర్ గా వస్తున్న రాజా విక్రమార్క నుంచి రాజా గారు బయటికొస్తే (Raja Garu Bayatakosthe) అంటూ ర్యాప్ స్టైల్‌తో షురూ అయ్యే పాటను విడుదల చేయగా..నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రాజా గారు బయటికొస్తే ప్రమాదమే ప్రయాసతో పరారు అంతే..రాజా గారు వేటకొస్తే భుజాలపై షికారులే ఖరారు అంతే..అంటూ సాగే కృష్ణకాంత్ రాయగా..డేవిడ్ సిమన్ పాడాడు.
కార్తికేయ పోషిస్తున్న ఎన్ఐఏ అధికారి పాత్రను ఎలివేట్ చేస్తూ సాగుతున్న పాట ఆకట్టుకుంటోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సారిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోంది. సుధాకర్ కోమాకుల కీలక పాత్రలో నటిస్తున్నాడు. 88 రామారెడ్డి ప్రొడక్షన్, ఆది రెడ్డి టీ సమర్పణలో నిర్మిస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోత్ డైరెక్షన్ లో వస్తున్న వాలిమై చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు కార్తికేయ. ఇవాళ కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన వలిమై లుక్ కు మంచి స్పందన వస్తోంది.
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!