శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 13, 2020 , 11:10:48

బాలీవుడ్ రీమేక్‌లో రాజ్‌త‌రుణ్‌..!

బాలీవుడ్ రీమేక్‌లో రాజ్‌త‌రుణ్‌..!

యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌కి కొద్ది రోజులుగా స‌రైన హిట్స్ లేవు. ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రంతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆయ‌న బాలీవుడ్ రీమేక్ డ్రీమ్ గార్ల్‌‌లో న‌టించబోతున్న‌ట్టు కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేశాయి. తాజాగా ఈ విష‌యాన్ని రాజ్ త‌రుణ్ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ క‌న్‌ఫాం చేశార‌ని అంటున్నారు. ఆయుష్మాన్ ఖురానా- నుష్రాత్ బరుచా జంటగా నటించిన  రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ `డ్రీమ్ గర్ల్`. బాలాజీ టెలీఫిల్మ్స్ సమర్పణలో.. శోభా కపూర్- ఏక్తా కపూర్ నిర్మించగా.. రాజ్ శాండిల్య డైరెక్ట్ చేసాడు. సెప్టెంబ‌ర్ 13,2019న విడుద‌లైన ఈ చిత్రం హిందీలో భారీ విజ‌యం సాధించింది.

డీమ్ గార్ల్ చిత్రంలో  ఆయుష్మాన్ ఖురానా అమ్మాయి గొంతు తో మాట్లాడుతూ ఒక కాల్ సెంటర్ లో పని చేస్తుంటారు. సినిమా అంతా కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంటుంది. ఇది ఒక క్రాస్ జెండర్ సినిమా. ఈ సినిమాతో త‌న అభిమానుల‌ని అల‌రించాల‌ని రాజ్ త‌రుణ్ ఎంతో ఉత్సాహంగా ఉన్నార‌ట‌. సురేష్ బాబు ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఇక ఇటీవ‌ల రాజ్ త‌రుణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న 14వ సినిమాకి సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాగా, ఇందులో త‌న కామెడీతో అలరించ‌నున్నాడ‌ట‌.


logo