గురువారం 25 ఫిబ్రవరి 2021
Cinema - Jan 16, 2021 , 00:59:00

పవర్‌ ప్లే థ్రిల్లర్‌

పవర్‌ ప్లే థ్రిల్లర్‌

రాజ్‌తరుణ్‌ హీరోగా విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘పవర్‌ప్లే’ అనే పేరును ఖరారుచేశారు. మహిధర్‌, దేవేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హేమల్‌ ఇంగ్లే కథానాయిక. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను హీరో రానా విడుదలచేశారు. రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ “ఒరేయ్‌ బుజ్జిగా’ తర్వాత దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండాతో నేను చేస్తున్న చిత్రమిది. థ్రిల్లర్‌ కథాంశంతో వైవిధ్యంగా సాగుతుంది. నటుడిగా నాకు ఓ కొత్త అనుభవంగా నిలుస్తుంది’ అని తెలిపారు. ‘రాజ్‌ తరుణ్‌ గత చిత్రాలకు భిన్నంగా సరికొత్త జోనర్‌లో రూపొందిస్తున్నాం.  అతడి పాత్ర నవ్య రీతిలో ఉంటుంది’ అని దర్శకుడు అన్నారు. థ్రిల్లర్‌ చిత్రాల్లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుందనే నమ్మకముందని, చిత్రీకరణ పూర్తయింది.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నామని నిర్మాతలు చెప్పారు. పూర్ణ, మధునందన్‌, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్‌ బొబ్బలి, ఛాయాగ్రహణం: ఆండ్రూ ఐ. 

VIDEOS

logo