e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home సినిమా Rai Lakshmi | సిండ్రెల్లా రహస్యం

Rai Lakshmi | సిండ్రెల్లా రహస్యం

రాయ్‌లక్ష్మి ద్విపాత్రాభినయంలో నటించిన తమిళ చిత్రం ‘సిండ్రెల్లా’. విను వెంకటేష్‌ దర్శకుడు. ఈ సినిమాను అదే పేరుతో నిర్మాతలు మంచాల రవికిరణ్‌, ఎం.ఎన్‌.రాజు తెలుగులో విడుదలచేస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో విజయ్‌ ఆంటోని విడుదలచేశారు. హారర్‌ అంశాలతో ట్రైలర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో పల్లెటూరి యువతిగా, ఆధునిక అమ్మాయిగా రెండు భిన్న పాత్రల్లో రాయ్‌లక్ష్మి కనిపిస్తోంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘హారర్‌, ఫాంటసీ, మర్డర్‌ మిస్టరీ అంశాల సమ్మిళితంగా సాగే చిత్రమిది. సిండ్రెల్లా ఎవరు? ఆమె జీవితం వెనకున్న రహస్యమేమిటన్నది ఆకట్టుకుంటుంది. రాయ్‌లక్ష్మి నటన, పాత్రచిత్రణ సరికొత్తగా ఉంటాయి. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అశ్వామిత్ర, సినిమాటోగ్రఫీ: రమ్మీ.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana