శనివారం 06 మార్చి 2021
Cinema - Dec 25, 2020 , 07:54:57

ఆసుప‌త్రిలో చేరిన వివాదాస్పద న‌టి

ఆసుప‌త్రిలో చేరిన వివాదాస్పద న‌టి

శాండల్‌వుడ్ డ్ర‌గ్స్ కేసులో క‌న్న‌డ భామ‌లు సంజ‌న‌, రాగిణి అరెస్ట్ కాగా, వారిద్ద‌రిని   ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార సెంట్ర‌ల్ జైలులో ఉంచిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ స‌మ‌యంలో రాగిణి ఆక‌స్మాత్తుగా జారి ప‌డ‌డంతో న‌డుముకు, వెన్న‌ముకకు తీవ్ర గాయ్యాల‌య్యాయి‌. జైల్లో త‌న‌కు చికిత్స అందించిన‌ప్ప‌టికీ, అంత‌గా ఉప‌శ‌మ‌నం ల‌భించ‌క‌పోవ‌డంతో ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స అందించాల‌ని  ర‌చ్చ చేసింది.

తాజాగా రాగిణికి మ‌రోసారి తీవ్ర‌మైన వెన్నునొప్పి రావ‌డంతో గురువారం ఆమెని సంజ‌య్ గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.  జైలులోని ఆసుప‌త్రి వార్డులో గ‌త కొన్ని రోజులుగా ఆమెకు ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నామ‌ని..   బుధ‌వారం ఆమెకు తీవ్ర నొప్పి రావ‌డంతో చికిత్స కోసం సంజ‌య్ గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు జైలు అధికారి తెలిపారు. ప్రైవేట్ ఆసుప‌త్రిలో రాగిణి చేరాలంటే కోర్టు అనుమ‌తి రావ‌ల్సి ఉంద‌ని వారు అన్నారు. కాగా, డ్ర‌గ్స్ కేసులో రాగిణి ద్వివేదిని ఈ సెప్టెంబ‌ర్‌లో సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. 

 

VIDEOS

logo