ఈ రోజుల్లో దర్శకులు 20 సినిమాలు తీయడానికి 20 సంవత్సరాలు తీసుకుంటున్నారు. అలాంటిది 100 సినిమాలు పూర్తి చేయడం చిన్న విషయం కాదు. తెలుగు ఇండస్ట్రీలో శతాధిక సినిమాల దర్శకులు కొందరు ఉన్నారు. దాసరి నారాయణరావు, రాఘవేంద్ర రావు, కోడి రామకృష్ణ లాంటి సీనియర్ దర్శకులు 100 సినిమాలు పూర్తి చేశారు. వీళ్లలో ఇప్పటికీ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈయన దాదాపు 106 సినిమాలు చేశారు. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలు చేసిన దర్శకేంద్రుడు ఈ మధ్య భక్తిమార్గంలో పయనిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కేవలం భక్తి సినిమాలు మాత్రమే తెరకెక్కిస్తున్నాడు రాఘవేంద్రరావు.
ఇదిలా ఉంటే 17 ఏళ్ల కిందట వచ్చిన ఈయన 100వ సినిమాపై ఇప్పుడు కొన్ని చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ఈయన 100వ సినిమా అల్లు అర్జున్ నటించిన గంగోత్రి కాదు. అదేంటి పోస్టర్స్ పై దర్శకేంద్రుడు 100వ సినిమా అని ఉంటుంది కదా.. మరి అలాంటప్పుడు అది కాకపోవడం ఏంటి అనుకుంటున్నారా..? నిజమే దర్శకేంద్రుడు తెరకెక్కించిన సెంచరీ మూవీ గంగోత్రి. అయితే దాని కంటే ముందు ఈయన తన 100వ సినిమా కోసం భారీ ప్రయత్నాలు చేశాడు. ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలను కలిపి త్రివేణి సంగమం అంటూ ఒక సబ్జెక్టు తయారు చేయించాడు.
అప్పట్లో నరసింహనాయుడు, ఇంద్ర లాంటి సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న చిన్ని కృష్ణతో వెంకటేష్, చిరంజీవి, నాగార్జున కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేయించాడు రాఘవేంద్రరావు. ఇది 100వ సినిమాగా తెరకెక్కించాలని ఆయన అనుకున్నాడు. అనుకున్నట్టుగానే అశ్వినీదత్, అల్లు అరవింద్ నిర్మాతలుగా ఫిక్స్ అయ్యారు. అంతా బాగానే ఉంది..కథ కూడా సిద్ధమైపోయింది. అయితే ఓ నిర్మాత అడిగిన ఒక ప్రశ్నతో సినిమా ఆగిపోయింది.
ముగ్గురు స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం అంటే చిన్న విషయం కాదు.. ఎందుకొచ్చిన తలకాయ నొప్పి.. ఎవరి అభిమానులు హర్ట్ అయినా కూడా సినిమాపై ప్రభావం పడుతుందని ఆయన చెప్పడంతో దర్శకేంద్రుడు ఆ ప్రయత్నం మానుకుని గంగోత్రి సినిమా చేశాడు. ఒక వేళ ఆ రోజు అన్ని కుదిరి ఉంటే త్రివేణి సంగమం తెలుగు ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ మల్టిస్టారర్ అయ్యేది. ఏదేమైనా అప్పుడు అలా ఒక భారీ మల్టీస్టారర్ మిస్ అయింది. ఆ తర్వాత కూడా దానిని తెరకెక్కించే ప్రయత్నాలు చేయలేదు రాఘవేంద్రరావు.
Video Player is loading.
This is a modal window.The media could not be loaded, either because the server or network failed or because the format is not supported.
PauseUnmuteLoaded: 13.83%Fullscreen
ఒక్కో రోజు 18 రోజులు షూట్లో రాశీఖన్నా..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
ప్రభాస్ సినిమాలో 10మంది బాలీవుడ్ యాక్టర్లు..!
నిర్ణయం మార్చుకున్న మెహరీన్ !
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?