శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Aug 02, 2020 , 12:49:10

చంద్ర‌ముఖి-2 పుకార్ల‌ను ఖండించిన లారెన్స్

చంద్ర‌ముఖి-2 పుకార్ల‌ను ఖండించిన లారెన్స్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన‌ చంద్ర‌ముఖి చిత్రం మంచి విజ‌యాన్ని అందుకున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పి వాసు.. సీక్వెల్‌గా చంద్ర‌ముఖి-2 చిత్రాన్ని ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ మూవీలో చంద్ర‌ముఖి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నేది హాట్ టాపిక్‌గా మారింది. గ‌తంలో న‌టించిన జ్యోతిక న‌టిస్తారా? లేదా? మ‌రొక‌రు న‌టిస్తారా? అన్న‌ది తేలాల్సి ఉంది. అయితే చంద్ర‌ముఖి-2లో జ్యోతిక‌, సిమ్రాన్, కియారా అడ్వాణీలో ఒక‌రు న‌టించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి. సీక్వెల్ లో న‌టించ‌మ‌ని త‌న‌ను ఎవ‌రూ అడ‌గ‌లేద‌ని జ్యోతిక ఇటీవ‌లే స్ప‌ష్టం చేసింది. 

ఈ వంద‌తుల నేప‌థ్యంలో సీక్వెల్‌లో న‌టిస్తున్న ద‌ర్శ‌కుడు లారెన్స్ స్పందించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆ పుకార్ల‌ను ఖండించారు. చంద్ర‌ముఖి-2లో న‌టి ఎవ‌ర‌నే విష‌యంలో అనేక పుకార్లు మీడియాలో వ‌స్తున్నాయి. జ్యోతిక మేడ‌మ్, సిమ్రాన్ మేడ‌మ్, కియారా అడ్వాణీ న‌టిస్తార‌ని వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అబ‌ద్ధం. అదంతా ఫేక్ న్యూస్. సీక్వెల్‌కు సంబంధించి స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. కొవిడ్ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత ప్రొడ‌క్ష‌న్ టీం ఆ వివ‌రాలు వెల్ల‌డిస్తుంది. మ‌హిళా క్యారెక్ట‌ర్ ఎవ‌ర‌నేది తామే అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని లారెన్స్ తెలిపారు.


logo