బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 05, 2020 , 16:49:37

స్వ‌చ్ఛ‌మైన రాజ‌కీయాలు చేస్తాను: లారెన్స్

స్వ‌చ్ఛ‌మైన రాజ‌కీయాలు చేస్తాను:  లారెన్స్

న‌టుడు, ద‌ర్శ‌కుడు, కొరియోగ్రాఫ‌ర్‌గా ఎన్నో లక్ష‌ల మంది మ‌న‌సులు గెలుచుకున్న లారెన్స్ సామాజిక కార్య‌క్ర‌మాల‌తో వారి హృద‌యాల‌లో ప‌దిలంగా నిలిచిపోయాడు. ఆప‌ద‌లో ఉన్నవారికి త‌ప్ప‌క సాయం చేసే లారెన్స్ .. రాజ‌కీయాల‌లోకి వ‌స్తే మరెన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేయోచ్చని భావించి రాజకీయాల‌లోకి రానున్న‌ట్టు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు త‌ను ర‌జనీకాంత్ పార్టీలో చేర‌తానంటూ స్ప‌ష్టం చేశారు.

కొన్ని ఏళ్ళుగా ఎన్నో సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నాను. వీటి వ‌ల‌న ఎందరో అభిమానులు ఏర్ప‌డ్డారు. వారు న‌న్ను రాజ‌కీయాల‌లోకి రావాల‌ని బ‌ల‌వంతపెడుతున్నారు. క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలో ఇది మ‌రింత ఎక్కువైంది. నా స‌మాజ సేవ‌కు మాజీ ముఖ్యమంత్రులు దివంగత జయలలిత, కరుణానిధితో పాటు స్టాలిన్, పళనిస్వామి ఎంతో సహాయం చేశారు. ఇప్ప‌టి రాజ‌కీయాల‌లో వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు, ప్ర‌త్య‌ర్ధుల‌పై రాజ‌కీయాలు చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి లేదు.

ర‌జ‌నీకాంత్ విప‌క్ష నాయ‌కుల‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌కుండా రాజ‌కీయాలు చేయ‌గ‌లుగుతున్నారు. అందుకే ఆయ‌న దారిలో న‌డుస్తూ స్వ‌చ్ఛ‌మైన రాజ‌కీయాలు చేయాల‌ని అనుకుంటున్నాను. సాయం చేసిన వారిని నేను విమ‌ర్శించ‌లేను . ర‌జ‌నీకాంత్ పార్టీ మొద‌లు పెడితే ఆయ‌న దారిలోనే పాజిటివ్ దృక్ప‌తంతో ముందుకు సాగుతానంటూ లారెన్స్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. లారెన్స్ ట్వీట్ ప్ర‌స్తుతం కోలీవుడ్ నాట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 


logo