హీరో లారెన్స్ రాఘవ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ‘దుర్గ’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదలచేశారు. ఇందులో నుదుటిపై తిలకం దిద్దుకొని పొడవైన తెల్లటి గడ్డంతో సాధువు వేషధారణలో లారెన్స్ కనిపిస్తున్నారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. హీరోగా నటిస్తూనే ఈ చిత్రానికి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కథాంశంతో, సస్పెన్స్ థ్రిల్లర్ ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసింది.