శనివారం 05 డిసెంబర్ 2020
Cinema - Oct 23, 2020 , 12:03:15

రాధేశ్యామ్ స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది

రాధేశ్యామ్ స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, గ్లామ‌ర్ బ్యూటీ పూజా హెగ్డే ప్రధాన పాత్ర‌ల‌లో  జిల్ ఫేమ్ రాధాకృష్ణ  తెర‌కెక్కిస్తున్న చిత్రం రాధే శ్యామ్. క‌రోనా వ‌ల‌న ఆగిన ఈ మూవీ చిత్ర షూటింగ్ ఇటీవ‌ల ఇట‌లీలో ప్రారంభించారు. అన్ని జాగ్ర‌త్త‌ల‌తో షూటింగ్ జ‌రుపుతున్నారు.  రూ. 140 కోట్ల బడ్జెట్‌తో  ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండగా, ఇటీవ‌ల మూవీలో ప్ర‌భాస్ లుక్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య‌గా అద‌ర‌గొడుతున్నాడు.

రాధే శ్యామ్‌ సినిమాను 2021లో విడుదల చేయనుండ‌గా, ఈ మూవీ  తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాష‌లలో రిలీజ్ కానుంది. ఇక ఈ రోజు ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్రం నుండి స‌ర్‌ప్రైజ్ వీడియో విడుద‌ల చేశారు మేకర్స్. బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ పేరుతో విడుద‌లైన ఈ వీడియో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తుంది. అర‌చేతిలో అద్భుత ప్రపంచాన్ని చూపిస్తూ ప్ర‌భాస్, పూజాల  మ‌ధ్య సాగిన రొమాంటిక్ విజువ‌ల్‌ను ఆవిష్క‌రించారు. జ‌స్టిస్ ప్ర‌భాక‌ర‌న్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన వీడియో అదుర్స్ అనేలా ఉంది. 

ప్రభాస్‌ 20వ చిత్రంగా యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరిలో ప్రభాస్‌ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ విఎఫ్‌ఎక్స్‌ టెక్నీషియన్‌ కమల్‌ కన్నన్‌ ఈ చిత్రానికి విఎఫ్‌ఎక్స్‌ విభాగంలో పని చేస్తుండడం విశేషం.  ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు కనబడుతోంది. పూర్వ జన్మలో ‘రాధే శ్యామ్’ గా ఉన్న హీరో, హీరోయిన్లు.. మరుసటి జన్మలో ‘విక్రమదిత్యగా, ప్రేరణగా ఉంటారని స‌మాచారం.