మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 14:47:05

రాధే శ్యామ్ స్టోరీ లైన్ రివీల్ చేసిన స‌చిన్

రాధే శ్యామ్ స్టోరీ లైన్ రివీల్ చేసిన స‌చిన్

డార్లింగ్ ప్ర‌భాస్ , మంగుళూరు సోయ‌గం పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాధాకృష్ణ కుమార్ తెరెకెక్కిస్తున్న చిత్రం రాధే శ్యామ్. ప్రస్తుతం ఇటలీలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. చారిత్రక ప్రేమికులు స్ఫూర్తిగా నాయకానాయికల పాత్ర చిత్రణ సాగుతుంది. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో ఓ వీడియో విడుద‌ల చేయ‌గా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అంతేకాదు గ‌త టీజ‌ర్‌ల రికార్డుల‌ని కూడా బ్రేక్ చేసింది. 

రాధేశ్యామ్ మూవీ ఏ కాన్సెప్ట్‌తో రూపొందుతుంద‌ని అంద‌రిలో అనేక అనుమానాలు ఉండ‌గా దానిపై క్లారిటీ ఇచ్చారు స‌చిన్ కేడ్క‌ర్. చిత్ర క‌థ సైన్స్‌కు, జ్యోతిష్యానికి మ‌ధ్య సాగుతుంది. క‌థ  చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నేను ఈ చిత్రంలో డాక్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నాను. ప్ర‌భాస్ భ‌విష్య‌త్‌పై పూర్తి క్లారిటీతో ఉండే వ్య‌క్తిగా సినిమాలో క‌నిపిస్తారు అని స‌చిన్ పేర్కొన్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం  తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది.