బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రతి రంజాన్ కు ఒక కొత్త సినిమాని విడుదల చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఇది చేస్తూనే ఉన్నాడు కండలవీరుడు. అలా పండక్కి వచ్చిన సినిమాలు దాదాపు విజయం సాధించాయి. ఇక ఈ ఏడాది రంజాన్ కు కూడా తన సినిమాను విడుదల చేస్తున్నాడు భాయ్. ఈయన నటించిన రాధే సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రభుదేవా తెరకెక్కించిన ఈ సినిమా పోకిరికి సీక్వెల్ అని తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ బాయ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సల్మాన్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు సీటీ మార్ పాట కూడా ఈ సినిమాకు బాగానే హెల్ప్ అయింది. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు సల్మాన్.
రాధే సినిమాను థియేటర్లతో పాటు డిజిటల్లో ఒకేసారి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. అయితే వాళ్లు ఈ డిసిషన్ తీసుకున్నపుడు దేశంలో సెకండ్ వేవ్ అప్పుడప్పుడే మొదలవుతుంది. కానీ ఇప్పుడు అది ఉగ్రరూపం దాల్చి రోజుకు కనీసం నాలుగు లక్షల కేసులు వచ్చే వరకూ పరిస్థితి మారిపోయింది. ఇలాంటి సమయంలో థియేటర్లలో విడుదల చేయడం సాధ్యం కావడం లేదు అంటున్నాడు సల్మాన్ ఖాన్. దాంతో కేవలం ఓటీటీ వేదికగా రాధే సినిమా విడుదలవుతుంది. పరిస్థితులు చక్కబడే వరకు సినిమాను వాయిదా వేయచ్చు కదా అనే వాదనలు వినిపిస్తున్న సమయంలో థియేటర్ల యాజమాన్యం కి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాడు సల్మాన్.
తన సినిమాను రంజాన్ సందర్భంగా విడుదల చేయాలని ఎప్పటినుంచో భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అందుకే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాధే సినిమా థియేటర్లలో కాకుండా కేవలం డిజిటల్ విడుదల చేస్తున్నామని.. పరిస్థితులు మీరు కూడా అర్థం చేసుకోవాలి అంటూ వాళ్లకు క్షమాపణలు చెప్పాడు. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సినిమా నేరుగా డిజిటల్ లో విడుదలైతే థియేటర్ యాజమాన్యం ఎన్ని వందల కోట్లు నష్టపోతుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు అంటున్నాడు కండల వీరుడు. మరి నేరుగా ఇంటికి వచ్చేస్తున్న ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రోజా కూతురు అన్షు మాలిక ఫొటోలు వైరల్
బాలీవుడ్ ఆఫర్‌కు నో చెప్పిన సాయి పల్లవి
రాజశేఖర్‌తో గోపీచంద్ మల్టీస్టారర్
డబ్బు కోసం నన్ను దారుణంగా మోసం చేశారు : రేణు దేశాయ్
మీ అసాధారణ సహకారానికి సాటిలేదు : మహేశ్‌బాబు
ఎన్టీఆర్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన చిరంజీవి
చనిపోయినట్టు ప్రచారం.. ఖండించిన శక్తిమాన్ నటుడు
సమంత శీర్షాసనం.. వైరల్‌గా మారిన వీడియో
కరోనా నుండి కోలుకున్న అల్లు అర్జున్
ఓటీటీలో నితిన్ చిత్రం.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
కరోనాతో నేషనల్ అవార్డ్ గ్రహీత కన్నుమూత