శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Feb 10, 2021 , 09:34:05

మూడోసారి గోపిచంద్‌తో జతకట్టనున్న రాశిఖన్నా

మూడోసారి గోపిచంద్‌తో జతకట్టనున్న రాశిఖన్నా

గోపిచంద్‌ హీరోగా మారుతీ దర్శకత్వంలో సినిమా తెరక్కనుంది. దీనికి ‘పక్కా కమర్షియల్‌’ టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రంలో మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా తీసుకోవాలని భావించారట. ఆ తర్వాత మేకర్స్‌ గోపిచంద్‌ను ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో గోపిచంద్‌కు జోడీగా రాశిఖన్నాను తీసుకోనున్నట్లు టాక్‌. ఇద్దరూ ఇప్పటికే జిల్‌, ఆక్సిజన్‌ చిత్రాల్లో ఈ జోడీ సందడి చేసింది. ఇదే నిజమైతే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వినోదం పంచనున్నట్లు తెలుస్తోంది. గతంలో మారుతి దర్శకత్వంలోనూ రాశిఖన్నా నటించింది. సాయిధరమ్‌ తేజ హీరోగా తెరకెక్కిన ‘ప్రతి రోజూపండుగే’ చిత్రంలో ఏంజిల్‌ ఆర్ణగా ఆకట్టుకుంది. ఈ చిత్రం యూవీ క్రియేషన్‌, బన్నీ వాసు నిర్మిస్తుండగా.. గీతా ఆర్ట్స్‌ అల్లూ అరవింద్‌ సమర్పణలో అక్టోబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే షూటింగ్‌ పట్టాలెక్కనుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే గోపీచంద్‌ సీటిమార్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు.

VIDEOS

logo