ఒకప్పుడు ఎంతో పద్దతిగా ఉండే రాశీ ఖన్నా లాక్డౌన్లో హద్దులు దాటి అందాలు ఆరబోసింది. చీరకట్టులో, మోడ్రన్ డ్రెస్సులలో ఈ అమ్మడి హాట్ షోని చూసి యూత్ పడిపోయారు. సినిమా ఆఫర్స్ పెద్దగా లేకపోవడంతో నిర్మాతల దృష్టిని ఆకర్షించేందుకు రాశీ ఖన్నా ఇలా చేసిందంటూ కొందరు కామెంట్స్ కూడా చేశారు.
రాశీ ఖన్నా ప్లాన్ బాగానే వర్కవుట్ అయినట్టు అనిపిస్తుంది. తెలుగులో ఏమో కాని తమిళంలో ఈ అమ్మడికి ఆఫర్స్ బాగా వస్తున్నాయి. ‘అరణ్మణై 3’, విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ వంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నరాశీ ఖన్నా.. కార్తీ ‘సర్దార్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించబోతుంది.
ధనుష్ హీరోగా మిత్రన్ జవహర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకి హీరోయిన్గా రాశీఖన్నాని సంప్రదించారని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. మరోవైపు తెలుగులో నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమాలో, అలాగే గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమాలో నటిస్తోంది. అదే విధంగా హిందీలో షాహిద్ కపూర్ ‘సన్నీ’ (వర్కింగ్ టైటిల్), అజయ్ దేవగణ్ ‘రుద్ర’ వెబ్ సిరీస్ ల్లో రాశీఖన్నా నటిస్తోంది. ప్రస్తుతానికి ఈ అమ్మడు కెరియర్ మంచి స్పీడ్ మీదుంది.