బుధవారం 03 జూన్ 2020
Cinema - May 16, 2020 , 13:10:09

సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న రాయ్ ల‌క్ష్మీ డ్యాన్స్

సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న రాయ్ ల‌క్ష్మీ డ్యాన్స్

సౌత్ పాపుల‌ర్ న‌టి రాయ్ ల‌క్ష్మీ తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో 50కి పైగా సినిమాల‌లో న‌టించారు. 17 ఏళ్ళ వ‌య‌స్సులో వెండితెర ఆరంగేట్రం చేసిన రాయ్ ల‌క్ష్మీ త‌మిళ చిత్రం క‌ర‌క క‌సాద‌రతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ త‌ర్వాత అనేక చిత్రాల‌లో లీడ్ రోల్స్ చేయ‌డం, కొన్నింటిలో స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ వ‌చ్చింది.

తాజాగా ఈ అమ్మ‌డు హాలీవుడ్ సాంగ్ హిట్స్ డోంట్ లై అనే సాంగ్‌కి స్టెప్పులు వేసి నెటిజ‌న్స్ దృష్టిని ఆకర్షించింది. రాయ్ ల‌క్ష్మీ ప‌ర్‌ఫార్మెన్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ అమ్మ‌డు 2017లో జూలీ 2 చిత్రంతో బాలీవుడ్ తెర‌కి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే.logo