బుధవారం 03 జూన్ 2020
Cinema - May 05, 2020 , 22:30:49

పల్లెటూరి తులసి

పల్లెటూరి తులసి

జయాపజయాలకు అతీతంగా  ప్రయోగాలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తోంది రాయ్‌లక్ష్మీ. తెలుగు,తమిళ భాషల్లో నవ్యమైన  కథాంశాల్ని ఎంచుకుంటోంది. ఆమె కథానాయికగా నటిస్తున్న   తాజా తమిళ చిత్రం ‘సిండ్రెల్లా’. మహిళా ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆత్మగా, ఆధునిక భావాలున్న సంగీతకారిణిగా, పల్లెటూరి యువతిగా మూడు భిన్న పార్శాలున్న పాత్రలో రాయ్‌లక్ష్మీ కనిపిస్తోంది. రాయ్‌లక్ష్మీ పుట్టినరోజును పురస్కరించుకొని మంగళవారం చిత్రబృందం ఆమె తాజా లుక్‌ను విడుదలచేసింది. తులసి అనే అమ్మాయిగా సహజత్వాన్ని ప్రతిబింబిస్తున్న ఈ లుక్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. మూడు కథలు, క్యారెక్టరైజేషన్స్‌తో సాగే చిత్రమిదని, నటిగా తనను కొత్త కోణంలో ఆవిష్కరిస్తుందని రాయ్‌లక్ష్మీ చెబుతోంది. ఎస్‌.జె.సూర్య శిష్యుడు వినూ వెంకటేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి అగర్వాల్‌ కీలక పాత్రను పోషిస్తోంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం తెలిపింది. logo