ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 15:42:16

ధోని కూతురిని బెదిరించిన వ్య‌క్తిని క‌ఠినంగా శిక్షించాలి..

ధోని కూతురిని బెదిరించిన వ్య‌క్తిని క‌ఠినంగా శిక్షించాలి..

భారత మాజీ కెప్టెన్ మాహేంద్ర సింగ్ ధోని కూతురు జీవాని బెదిరిస్తూ ఓ వ్య‌క్తి ఇన్‌స్టాగ్రామ్‌లో దారుణ‌మైన కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. కోల్‌క‌తాతో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై టీం ఓట‌మి పాలైన త‌ర్వాత ఆ వ్య‌క్తి కామెంట్స్ చేశాడు. అయితే తాజాగా పోలీసులు గుజ‌రాత్‌లోని క‌చ్ జిల్లాలో అత‌నిని అదుపులోకి తీసుకున్నారు. నేరం చేసిన వ్య‌క్తి టీనేజ‌ర్ కాగా, అత‌నిని రాంచి పోలీసుల‌కి అప్ప‌గించ‌నున్నారు. 

16 ఏళ్ళ కుర్రాడు నీచ‌మైన కామెంట్స్ చేయ‌డంతో అత‌నిని క‌ఠినంగా శిక్షించాల‌ని నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా న‌టుడు మాధ‌వ‌న్ కూడా ఈ ఇష్యూపై స్పందించారు. ఎంఎస్ ధోని కుమార్తెని బెదిరించిన టీనేజ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డం గొప్ప ప‌రిణామం. సోష‌ల్ మీడియాలో తాము ఏమైన మాట్లాడొచ్చు అని భావించే వారికి  గ‌ట్టిగా బుద్ది చెప్పాలి. చ‌ట్ట ప్ర‌కారం శిక్షించాలి. ఇలాంటి నీచ‌మైన ప‌నులు చేసే వారు టీనేజ‌ర్స్ అయిన వ‌దిలి పెట్టొద్దు అని మాధ‌వన్ పేర్కొన్నాడు.


logo