మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 14:29:00

కరోనా జాగ్రత్తలపై పీవీఆర్‌ సినిమాస్‌ వీడియో విడుదల

కరోనా జాగ్రత్తలపై పీవీఆర్‌ సినిమాస్‌ వీడియో విడుదల

హైదరాబాద్‌ : పెద్ద హీరో సినిమా విడుదలవుతుంది అంటే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మామూలగా ఉండదు. కరోనా వ్యాప్తి కారణంగా ఈ హంగామంతా కనుమరుగయ్యే అవకాశం ఉంది. లౌక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ థియేటర్లను తెరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో తెలియజేస్తూ పీవీఆర్‌ సినామాస్‌ తాజాగా వీడియోను విడుదల చేసింది. ఇందులో ప్రేక్షకులకు కరోనా సోకకుండా తీసుకునే చర్యలను వివరించింది. ప్రతీ షోకు కుర్చీలను శానిటైజ్‌ చేయడం, ఒక సీటు నుంచి మరో సీటుకు దూరం పాటించడం ఇలా ఎన్నో జాగ్రత్తలను వివరిస్తూ వీడియోను విడుదల చేశారు నిర్వహకులు.

అంతే కాదు కొవిడ్‌ నిబంధనలపై థియేటర్ల సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. పీవీఆర్‌ సినిమాస్‌కు దేశ వ్యాప్తంగా 822 స్క్రీన్‌లు ఉన్నాయి. శ్రీలంకలోనూ ఈ సంస్థ చిత్రాలను ప్రదర్శిస్తుంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే తాము థియేటర్లలో తీసుకునే జాగ్రత్తలను వివరించింది పీవీఆర్‌ సినిమాస్.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo