బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 25, 2020 , 09:19:26

మా సంసారంలో నిప్పులు పోయోద్దు రియ‌ల్ లైఫ్ మెగాస్టార్

మా సంసారంలో నిప్పులు పోయోద్దు రియ‌ల్ లైఫ్ మెగాస్టార్

లాక్ డౌన్ స‌మంలో ఇంట్లో ఆడ‌వాళ్ల‌కి సాయంగా ఉండాల‌నే ఉద్దేశ్యంతో మొద‌లైన బీ ది రియ‌ల్ మ్యాన్ ఛాలెంజ్ స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతుంది. అర్జున్ రెడ్డి డెరెక్ట‌ర్ మొద‌లు పెట్టిన ఈ ఛాలెంజ్ ర‌ణ్‌వీర్ సింగ్ వ‌ర‌కు వెళ్లింది. టాలీవుడ్ స్టార్స్ అంద‌రు ఈ ఛాలెంజ్‌ని స్వీక‌రించి త‌మ టాస్క్‌కి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ వ‌స్తున్నారు.

ఇక రీసెంట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఈ ఛాలెంజ్‌ను మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్లో చేసి చూపించారు. త‌ల్లి కోసం ప్రేమ‌తో దోశె వేసి ఆమె ప‌క్క‌న కూర్చొని తిన్నారు. ఈ వీడియో ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాన్ని క‌దిలించింది. అయితే చిరు వీడియోపై పై నిర్మాత పీవీపీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.  ‘‘చిరంజీవి గారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలము, గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్ లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు.. మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్‌గారు.. జోక్స్ పక్కన పెడితే.. మీ నిరంతర ప్రేరణ ప్రశంసనీయం సర్’’ అంటూ పీవీపీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది


logo