ఆనంద్ దేవరకొండ, గీత్ సైని జంటగా నటిస్తున్న చిత్రం ‘పుష్పక విమానం’. దామోదర దర్శకుడు. అగ్ర హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్ధన్‌రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘కల్యాణం’ అనే పల్లవితో సాగే సెకండ్ సింగిల్‌ను ఈ నెల 18న కథానాయిక సమంత విడుదలచేయనున్నది.‘మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే అనుబంధాలు, ఆప్యాయతలకు దర్పణంలా ఉండే చిత్రమిది. చక్కటి వినోదంతో పాటు హృదయాల్ని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సిధ్‌శ్రీరామ్, మంగ్లీ ఆలపించిన ‘కల్యాణం’ పాట సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని తెలిపారు. శాన్వి మేఘన, సునీల్, నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, సంగీతం: రామ్ మిరియాల, సిద్దార్థ్, అమిత్ దాసాని.