ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్పక విమానం’. దామోదర దర్శకుడు. గోవర్ధన్‌రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు. నవంబర్ 12న ప్రేక్షకులముందుకు రానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇందులో ఆనంద్ దేవరకొండ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కనిపిస్తారు. మధ్య తరగతి కుటుంబాల్లో బంధాల్ని ఆవిష్కరిస్తూ పెళ్లి చుట్టూ కథ నడుస్తుంది. ఆద్యంతం వినోదప్రధానంగా ఆకట్టుకుంటుంది’ అన్నారు. థియేటర్లలోనే సినిమాను విడుదల చేయబోతున్నామని, సకుటుంబ వినోద చిత్రంగా మెప్పిస్తుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, సంగీతం: రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, సమర్పణ: విజయ్ దేవరకొండ, నిర్మాణ సంస్థలు: కింగ్ ఆఫ్ ది హిల్, టాంగా ప్రొడక్షన్స్.