బుధవారం 25 నవంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 19:25:26

వైజాగ్ కు వెళ్ల‌నున్న పుష్ప టీం..!

వైజాగ్ కు వెళ్ల‌నున్న పుష్ప టీం..!

అల్లు అర్జున్, రష్మిక కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం పుష్ప‌. సుకుమార్ డైరెక్ష‌న్ లో వ‌స్తోన్న ఈ చిత్ర‌షూటింగ్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. న‌వంబ‌ర్ నుంచి షూటింగ్ రీస్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేసుకుంది సుకుమార్ అండ్ టీం. సుమారు ఏడు నెల‌ల విరామం త‌ర్వాత ర‌ష్మిక‌, అల్లు అర్జున్ షూటింగ్ షురూ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్ర‌ధాన తారాగ‌ణంపై వ‌చ్చే స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం త్వ‌ర‌లో పుష్ప టీం విశాఖప‌ట్నంకు వెళ్ల‌నుంద‌ట‌.

2021 మొద‌ల‌య్యేనాటికి సినిమాను పూర్తి చేయాల‌ని భావిస్తున్నాడ‌ట అల్లు అర్జున్. ఫిల్మ్ షూటింగ్ షెడ్యూల్‌పై చిత్ర‌యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంది. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్నా ఫారెస్ట్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. కేర‌ళ అడ‌వుల్లో ప్ర‌ధాన భాగం షూట్ చేయాల్సి ఉండ‌గా..కోవిడ్ ప్ర‌భావంతో షూటింగ్ ను నిలిపేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.