ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 14:30:46

రాజ‌మండ్రిలో రిసార్ట్ బుక్ చేసిన పుష్ప టీం

రాజ‌మండ్రిలో రిసార్ట్ బుక్ చేసిన పుష్ప టీం

అల్లుఅర్జున్‌-సుకుమార్ కాంబినేష‌న్ లో పుష్ప సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆగిపోయిన షూటింగ్ త్వ‌ర‌లో  షురూ చేసేందుకు బ‌న్నీఅండ్ టీం రెడీ అవుతోంది. ఈ సినిమా షెడ్యూల్ ను రాజ‌మండ్రికి స‌మీపంలోని మారెడుమిల్లి ఫారెస్ట్ ప్రాంతంలో షూట్ చేయాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో నిర్మాత‌లు రాజ‌మండ్రిలో ఓ రిసార్ట్ బుక్ చేశార‌ట‌. ఫ‌స్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్త‌య్యే వ‌ర‌కు చిత్ర‌యూనిట్ అంతా రిసార్ట్‌లో నే ఉండేలా ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు క‌రోనా ప్ర‌భావం నేప‌థ్యంలో షెడ్యూల్ పూర్త‌యే వ‌ర‌కు సెట్స్ నుంచి ఎవ‌రిని బ‌య‌ట‌కు పంపించ‌డం ఉండ‌కూడ‌ద‌ని నిర్మాత‌లు ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం.

షూటింగ్ లో పాల్గొనే ముందు చిత్ర‌యూనిట్ స‌భ్యులు క్వారంటైన్ లో ఉండ‌నున్నారు. క‌థానుగుణంగా ఫ‌స్ట్ షెడ్యూల్ ను కేర‌ళ అడ‌వుల్లో చిత్రీక‌రించాల్సి ఉండ‌గా..అక్క‌డ కోవిడ్ కేసుల అధికంగా ఉన్న నేప‌థ్యంలో లొకేష‌న్ ను మార్చేశారు నిర్మాత‌లు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo