మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 28, 2021 , 10:57:12

మెగా హీరోల మూవీ రిలీజ్ డేట్స్ వ‌చ్చేశాయి..!

మెగా హీరోల మూవీ రిలీజ్ డేట్స్ వ‌చ్చేశాయి..!

రానున్న రోజుల‌లో మెగా హీరోల మూవీల‌కు సంబంధించిన ర‌చ్చ మాములుగా ఉండ‌దు. చిరంజీవి నుండి మొద‌లు పెడితే వైష్ణ‌వ్ తేజ్ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క హీరో ఈ ఏడాది త‌మ సినిమాల‌తో అల‌రించ‌నున్నాడు. చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య సినిమా చేస్తుండ‌గా, ఈ మూవీని స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేసేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నాడు. ఇక ప‌వన్ న‌టించిన వ‌కీల్ సాబ్ ఏప్రిల్‌లో రానుంది. రామ్ చ‌ర‌ణ్ తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. 

వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న‌క‌మ‌ర్షియ‌ల్ చిత్రం గ‌ని జూలై 30న రిలీజ్ కానున్న‌ట్టు తాజాగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు. ఇక అల్లు అర్జున్ న‌టిస్తున్న‌ పుష్ప మూవీకి కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 13న ఈ మూవీ విడుద‌ల కానుంద‌ని కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించారు. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బ‌న్నీ..పుష్ప‌రాజ్ పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు. ఇక సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన తొలి చిత్రం ఉప్పెన ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల కానుంది. క‌ళ్యాణ్ దేవ్ న‌టించిన సూప‌ర్ మ‌చ్చి కూడా త్వ‌ర‌లోనే రానుంది. ఈ ఏడాది సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ అంటూ అల‌రించిన సాయి తేజ్ మ‌రి కొద్ది రోజుల‌లో రిప‌బ్లిక్ మూవీతో థియేట‌ర్స్‌లోకి రానున్నాడు. ఈ లెక్క‌లు చూస్తుంటే రానున్న రోజుల‌లో మెగా హీరోల ర‌చ్చ మాములుగా ఉండ‌ద‌ని అర్ద‌మ‌వుతుంది.

VIDEOS

logo